29 March, 2026 | 2:27 AM

ఆశా వర్కర్ల చలో అసెంబ్లీ

29-03-2026 12:45 AM
  1. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో అనుమతి లేదంటూ ఆశాలపై రెచ్చిపోయిన పోలీసులు
  2. తోపులాటలో పలువురు ఆశాలకు గాయాలు
  3. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బైఠాయించిన ఆశాలు

ముషీరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): తమ న్యాయమైన సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శనివారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయ మేనా డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చౌక్ కు ర్యాలీగా వెళుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు అరెస్టుల పేరుతో రెచ్చిపోయి ఆశా వర్కర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల తోపులా టల మధ్య పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి.

తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) సంఘం అధ్యక్షురాలు ఆర్. సంతోష, ప్రధా న కార్యదర్శి బీ. మంజుల, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్ టియు) రాష్ట్ర అధ్యక్షుడు జి. రాంబాబు యాదవ్‌ల ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం18వేలు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వెళుతున్న వందలాదిమంది ఆశా వర్కర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో పోలీసులు అడ్డుకున్నారు. ముందుగా ఆశా వర్కర్ల న్యాయమైన డి మాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆశా వర్కర్లు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు.

ఈ క్రమంలో ఆందోళన కారులకు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటలకు దారి తీయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్ల కార్డులు చేత బూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేపడుతున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశా వర్కర్లకు మద్దతు గా బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ నిరసనలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమ లు చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్టు చేసిన ఆశా వర్కర్ల అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మంజుల, ఆశా వర్కర్లు ఎస్. రేణుక, ఎం. యాదమ్మ, సమత, లక్ష్మీ, వాణి, స్వరూప, ఎస్కే సహారా, రాము, మం జుల, అనిత, భవాని, అపర్ణ, మహేశ్వరి, సరస్వతి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ముఠా జై సింహ, ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్ ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, వల్లాల శ్యామ్ యాదవ్, ఎం. రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, కొండ శ్రీధర్ రెడ్డి, ఏ. శంకర్ గౌడ్, రాజా దీన్ దయాల్ రెడ్డి, శివ ముదిరాజ్ తదితరులు హాజరై మద్దతు తెలిపారు.