6 July, 2026 | 1:54 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

నా మనసు చెప్పిందే వింటా

29-05-2025 12:00 AM

నిరుడు ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి2898ఏడీ’ చిత్రంలో సుమతి పాత్రలో సందడి చేసింది బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. ఆ తర్వాత చివరిసారిగా ‘సింగం అగైన్’లో కనిపించింది.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, కరీనాకపూర్‌ఖాన్, రణ్‌వీర్‌సింగ్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రలు పోషించింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయితీగా ఉండటమే ముఖ్యమని, తాను దానికే ప్రాధాతనిస్తానని తెలిపింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పేది వింటానని, ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటానని తెలిపింది.

అయితే, దీపిక నిజాయితీ గురించి మాట్లాడటం వెనుక కారణం లేకపోలేదని నెటిజన్లు అనుకుంటున్నారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో దీపికా పదుకొణె పేరు వైరల్‌గా మారింది. తన సినిమాను లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్ డైరెక్టర్ చేసిన ఆమెను ఉద్దేశించే కామెంట్స్ చేశారని, అందుకే తాజాగా దీపిక స్పందించారనేది నెటిజన్ల అభిప్రాయం. ఆ వివాదం నేపథ్యంలోనే దీపికా పరోక్షంగా తాజా నిజాయితీ గురించి మాట్లాడారని అనుకుంటున్నారు.