06-12-2025 08:20:22 PM
* సేవే లక్ష్యం.. ప్రేమే మార్గం
* రీచ్ అండ్ కేర్ పరిచర్య ద్వారా వితంతువులకు 40 కుట్టు మిషన్లు పంపిణీ
రీచ్ అండ్ కేర్ వ్యవస్థాపకులు జాన్ వర్గీస్
గరిడేపల్లి,(విజయక్రాంతి): సేవ ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని రీచ్ అండ్ కేర్ వ్యవస్థాపకులు జాన్ వర్గీస్ అన్నారు. గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో భర్తలను కోల్పోయి దీనస్థితిలో ఉన్న బీద కుటుంబాలకు జీవనోపాధి లభించేందుకు మహిళలకు ఉచితంగా టైలరింగ్ నేర్పి 40 కుటుంబాలకు 40 కుట్టు మిషన్లు అందించినట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయి చదువుకోవాలని తపన ఉన్న పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం హాస్టల్ తో కీతవారిగూడెంలో ఎంతో మందికి విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
అణగారిన వర్గాల వారిని అభాగ్యులను ఆదుకునే విధంగా రీచ్ అండ్ కేర్ సమస్త ద్వారా అనాధ కుటుంబాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. దేవుడు తన పరిచర్య ద్వారా దాతల సహాయ సహకారాలతో కుల మత భేదాలు లేకుండా అందరికీ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పాస్టర్ దయాకర్ సువార్త దంపతులు ద్వారా ప్రతి సంవత్సరం అనాధ ఆడపడుచులకు జీవనోపాధి అందించే విధంగా కుట్టు మిషన్లు వారి పిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.