calender_icon.png 6 December, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికలకు సై అంటున్న అభ్యర్థులు

06-12-2025 08:15:32 PM

తానూరు (విజయక్రాంతి): తానూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ నెల 17న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటాపోటీగా నామినేషన్ లను దాఖలు చేయడంతో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మండలంలో మొత్తం జీపీలు 20 ఉండగా సర్పంచ్లకు 160 వార్డు సభ్యులకు 508 నామినేషన్ దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తాము పోటీలో ఉన్నామని పేర్కొంటూ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల దృవ పత్రాల పరిశీలన శనివారం నిర్వహించారు. ఆయా కేంద్రాలను జిల్లా ప్రత్యేక పరిశీలనలు ఆయేషా మస్రుత్ ఖాన్ పరిశీలించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.