13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి

28-03-2026 02:02 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): ప్రస్తుత బడ్జెట్ లో బీసీ కార్పోరేషన్ కు రూ.10వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణ య్య సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బీసీ బంధు పథకం ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు.

బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 16 బీసీ కుల ఫెడరేషన్లకు  రుణం కూడా ఇవ్వకుండా 13 ఏళ్ల కాలంలో నిర్వీర్యం అయ్యాయన్నారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టగానే బీసీలలో కూడా బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలనే ఆశలు కలగడం సహజమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు, బీసీబంధు పథకం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.  బీసీ బంధు పథకం వెంటనే ప్రవేశ పెట్టి ప్రతి కుటుంబానికి మంజూరు చేయాలన్నారు.