సీతారాములకు 2.5 కోట్ల ఆభరణాలు
అందజేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, మార్చి 27(విజయక్రాంతి): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటా రనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరూ ఊహించని విధంగా కార్యక్రమాలు చేయ డం ఆయనకు అలవాటు. శుక్రవారం శ్రీరా మ నవమి సందర్భంగా సంగారెడ్డిలోని రా మ్‌నగర్ మందిర్‌లో శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ప్రత్యేకంగా జగ్గారెడ్డి మిత్రబృందం, రామ్ మందిర్ యువసేన, ఆలయ కమిటీ పెద్దల సహకారంతో రూ.2.50 కోట్లతో బం గారు, వెండి ఆభరణాలను చేయించారు.
సీతారాముల వారికి 2 కిలోల 250 గ్రాము ల బంగారంతో కర్ణాభరణాలతో కూడిన కిరీటాలు, కంటాభరణాలు, వడ్డాణాలు, పద్మ పాదాలు, ధనస్సు, బాణం, యజ్ఞోపవీతం, నయనాలు, తిలకాలు, ముక్కు పోగు, శంఖచక్రాలు, అమ్మవారికి మంగళ సూత్రం, అ మ్మవారికి కమల హస్తం, రాముల వారికి శరంతో కూడిన హస్తం చేయించారు.అలాగే 10 కిలోల వెండితో ఆదిశేషుడు, వెండి కల్యా ణ పీట బహుకరించారు. కాగా రామ్ నగర్ లోని జగ్గారెడ్డి ఇంట్లో ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆభరణాల ఊరేగింపు చేపట్టారు.అనంతరం స్వా మివారికి ఆభరణాలను సమర్పించి అలంకరించారు. అనంతరం రంగంపేట పీఠాధిప తులు మాదవానంద సరస్వతి స్వామి వారి పర్యవేక్షణలో జ్యోతిర్వాస్తు విద్యా పీఠం పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు.




