calender_icon.png 16 October, 2024 | 12:31 AM

బీసీ రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు చేపట్టాలి

13-09-2024 12:14:24 AM

అఖిల భారత యాదవ మహాసభ కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన కార్యదర్శిగా పదవి చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలోనూ రేవంత్ సర్కా ర్ యాదవులకు చోటు కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో యువతకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి మండలిలో సగానికి పైగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.