calender_icon.png 2 October, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చారిత్రాత్మక బురుజుకు పునరుజ్జీవం

02-10-2025 12:00:00 AM

నంగునూరు, అక్టోబర్ 1:చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వాల సహకారం కో సం ఎదురుచూడకుండా,స్వయంగా నడుం బిగించి తమ గ్రామ చిహ్నమైన బురుజుకు పునరుజ్జీవం  నంగునూర్ మండ లం మగ్దూంపూర్ గ్రామ యువకులు దస రా ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో త మ బురుజు పవిత్రంగా సుందరంగా ఉండాలనే సదుద్దేశంతో శ్రమ తీశారు.గ్రామ చరిత్ర కు,సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఈ చారిత్రాత్మక బురుజు శిథిలావస్థకు చేరిం ది. బురుజుపై మొలిచిన చెట్లు, మొక్కలు, పేరుకుపోయిన చెత్త, చెదారం దాని పూర్వ వైభవాన్ని కప్పేశాయి.

ఈ పరిస్థితిని గమనించిన గ్రామ యువకులు, తమ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపనతో ఏకమయ్యారు. బురుజును శుభ్రం చేసే పనులను చేపట్టారు. గ్రామస్థులంతా ఈ బురుజు వద్దే దసరా ఉ త్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వ స్తోంది. ఈ నేపథ్యంలో యువకులు తమ చారిత్రక కట్టడాన్ని పవిత్రంగా,భక్తిశ్రద్ధలతో ఉంచేందుకు కృషి చేయడం అభినందనీయంని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. ప్రభు త్వ సహకారం కోసం ఎదురుచూడలేదు.

తమ సొంత ఖర్చులతో శ్రమదానంతోనే తమ చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూ, ఇతర గ్రామాలకుర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జాప హరికృష్ణ,వాసర శ్యామ్ ప్రసాద్, అంరెడ్డి భగవాన్ రెడ్డి, బర్మ రాజు, బట్ట బాలకిషన్, అచ్చిన హరికిషన్, బట్ట కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.