పదవ తరగతి లో సత్తా చాటిన లోహిత
29-04-2026 05:36 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ దంపతుల కూతురు లోహిత (మహీ) పదవ తరగతి మఠంపల్లిలోని మాంట్ స్పోర్ట్స్ స్కూల్ లో చదువుతున్నారు.600 మార్కులకు గాను 578 మార్కులు సాధించి లోహిత సత్తా చాటారు. మఠంపల్లి మండలంలో టాపర్ గా నిలిచిన ఆమెకు గ్రామ ప్రజలు,బంధువులు స్నేహితులు అభినందనలు తెలిపారు.






