వరి ధాన్యం కొనుగోలులో గింజ కటింగు ఉండదు
మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం
ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామాల్లో బుధవారం సింగిల్ విండో, ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్లు , మక్కల కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది అన్నారు.
గతంలో మొక్కజొన్న రైతులకు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు రూ. 2,400/- మద్దతు ధర నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు కు మద్దికుంట సర్పంచ్ బోయిని లావణ్య, అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయికుమార్ లు మెమోటో అందజేసి ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ సతీష్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, డైరెక్టర్లు, మాజీ ఎంపీపీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సింగిల్ విండో, ఐకెపి సీసీలు, పలు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.






