సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
23-07-2026 12:58 PM
సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర రావు
ఎర్రుపాలెం జులై 23 (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి మద్దెల ప్రభాకర్ రావు తెలియజేశారు. ఈ నేల జూలై 24,25 శుక్ర, శని వారాలలో ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో జరుగుతాయని తెలియజేస్తూ ఈ రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు పిలుపునిచ్చారు. ఈ తరగతులకు మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు,పార్టీ శ్రేణులు, ప్రజాసంఘ బాధ్యులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు షేక్ నాగుల్ మీరా, షేక్ మోహిద్దీన్, మేకాల పుల్లయ్య ,షేక్ ఉద్ధoడ్, షేక్ కరిముల్లా తదితర్లు పాల్గొన్నారు.






