ఆశ్రమ జీవితాలకు భద్రత కరవు
- జ్యోతిరావుపులే పాఠశాలల్లోఘటన
- 24 మందికి పైగా అస్వస్థత
- ఫుడ్ పాయిజన్ కలకలం
- అధికారుల పర్యవేక్షణ లోపం
- భయాందోళనలో తల్లిదండ్రులు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆశ్రమ పాఠశాలలో విద్యారులకు భద్రత పై భరోసా తగ్గుముఖo పడుతుంది. జిల్లాలో ఎక్కడో ఒక చోట విద్యారులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు.. ఇలాంటి సంఘటనలు ప్రస్తుతం సర్వసాధారణం అయ్యాయి. మరో సారి బెల్లంపల్లి లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ సంఘటన ఇదే రుజువు చేస్తున్నది. విద్యార్థుల ఫుడ్ పాయిజన్ సంఘటన బెల్లంపల్లిలో కలకలం రేపుతున్నది. బెల్లంపల్లి బాబుజ్యోతిరావుపూలే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కుగురయ్యారు.
రాత్రి భోజనాల అనంతరం 15 మంది ఫుడ్ పాయిజన్ తో వాంతులు చేసుకున్నారు. చికిత్స కోసం వెంటనే విద్యార్థినీలను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటానీ తరలించారు. ఇందులో కొంతమంది పరిస్థితీ మెరుగుపడటంతో వారిని రాత్రే తిరిగి పాఠశాలకు పంపించారు. ఉదయం మరికొంత మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో మొత్తం 400 మంది వరకు విద్యార్థినిలు ఉన్నారు. ఇందులో15 మంది ఫుడ్ పాయిజన్ కు కుగురయ్యారు. సకాలంలో హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఈ సంఘటన సమాచారం తెలియడంతో బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావస్వాతి జ్యోతిరావు ఫూలే పాఠశాలకు వచ్చారు. అస్వస్థకు గురైన విద్యార్థులనతో మాట్లాడారు. సంఘటన వివరాలను తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించారు. విద్యార్థినిలతో మాట్లాడారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చైర్పర్సన్ కూడా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.






