హెచ్‌సీఏ, సీఐడీకి లోకాయుక్త నోటీసులు
టీజీ20 లీగ్ నిర్వహణపై టీసీఏ ప్రశ్నలు
హైదరాబాద్, జూన్ 8, 2026: తెలంగాణ క్రికెట్‌లో పారదర్శకత, జవా బుదారీతనం కోసం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) చేపట్టిన పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి దాఖ లు చేసిన ప్రజాహిత ఫిర్యాదుపై విచారణ జరిపిన తెలంగాణ లోకాయుక్త, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సీఐ డీకి నోటీసులు జారీ చేసింది.
టీసీఏ గతం లో సమర్పించిన ఫిర్యాదులపై చర్యల నివేదికలు సమర్పించాలని ఆదేశించిన లోకా యుక్త, తదుపరి విచారణను జూన్ 19కు వాయిదా వేసింది. హెచ్‌సీఏ ఆర్థిక,పరిపాలన అక్రమాలు, విశాఖ విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ.69 కోట్ల చెల్లింపులు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాలు, 18 జీహెచ్‌ఎంసీ క్రికెట్ క్లబ్ ఆస్తుల బదిలీ వంటి తీవ్ర ఆరోపణలతో కూడిన అంశాలను టీసీఏ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశాలపై ఫోరెన్సిక్ దర్యాపుతో పాటు రికార్డుల పరిరక్షణ, బాధ్యుల పాత్రపై సమగ్ర విచారణ జరపాలని టీ సీఏ కోరింది.
ఇదిలా ఉంటే టీజీ-20 లీగ్ చట్టబద్ధతపై కూ డా టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం సాధారణ సభ ఆమోదించిన గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇ లాంటి లీగ్ నిర్వహణ అధికారం ఉంటుందన్నారు. బీసీసీఐ నుంచి అవసరమైన అను మతులు పొందారా అనే విషయాన్ని స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పే రుతో నిర్వహిస్తున్న లీగ్‌లో ఫ్రాంచైజీలు, నిర్వహణ బాధ్యతలు, కీలక ఆపరేషన్లు ప్రధానంగా బయటి రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉండటం బాధాకరమన్నా రు. తెలంగాణ ప్రజలు టికెట్లు కొనాలి, మ్యా చ్‌లు తెలంగాణలో జరగాలి, కానీ అవకాశాలు, ప్రయోజనాలు మాత్రం బయటివారి కే దక్కాలా అని ప్రశ్నించారు.






