సూర్య విధ్వంసం
09-06-2026 12:00 AM
టీ20 ముంబై లీగ్
ముంబై, జూన్ 8: టీమిండియా కెప్టెన్సీతో పాటు జట్టులో ప్లేస్ చేజార్చుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ మేల్కొన్నట్టున్నాడు. తాజాగా టీ20 ముంబై లీగ్‌లో తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 పరుగు లు చేసిన స్కై.. తాజాగా రెండో మ్యాచ్‌లో మ రింతగా చెలరేగిపోయి కేవలం 36 బంతుల్లోనే అజేయమైన 72 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. తొలుత బ్యా టింగ్ చేసిన రాయల్స్.. సిల్వెస్టర్ డిసౌజా (5/21) ధాటికి 152 పరుగులకే ఆలౌటైంది. ఛేజింగ్‌లో ట్రంప్స్ నైట్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ద సెంచరీతో పా టు నూతన్ కుమార్ గోయెల్ (56) కూడా రాణించడంతో 16 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.






