13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఘనంగా రాములోరి కల్యాణం

28-03-2026 12:54 AM

రామనామ స్మరణతో మార్మోగిన పల్లెలు

కళ్యాణానికి హాజరైన ప్రముఖులు

సంస్థాన్ నారాయణపూర్, మార్చి 27 : మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.భక్తి శ్రద్ధలతో రామనామస్మరణతో  రాములవారి కళ్యాణం కమనీయంగా జరిగింది.

నారాయణపూర్ మండలకేంద్రంలో.. 

గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయం దశమ వార్షికోత్సవాలు కమిటీ అధ్యక్షులు వడ్డేపల్లి రాములు సాగర్ ఆధ్వర్యంలో కన్నులపండువగా నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు ,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సతీమణి కర్నె స్వాతి,సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి,పాలకవర్గ సభ్యులు,వివిధ పార్టీల ముఖ్యనేతలు,అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణానికి హాజరయ్యారు.

అల్లందేవిచెర్వులో..

నారాయణపురం మండలం అల్లందేవిచెర్వు గ్రామంలో మొదటి సారిగా రాములవారి కళ్యాణాన్ని  సర్పంచ్ సూర్వి సౌజన్య రాజుగౌడ్ నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి హాజరై కళ్యాణాన్ని వీక్షించారు.గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామస్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.