28 March, 2026 | 2:58 AM

జాన్‌పహాడ్‌లో అలరించిన నాటకం

28-03-2026 12:52 AM

పాలకవీడు, మార్చి 27 :  మండలంలోని  జాన్ పహాడ్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా గురువారం  రాత్రి తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర కళా నాట్య మండలి ఆధ్వర్యంలో సీనియర్ కళాకారులతో పాలకవీడు మండల పౌరాణిక కళాకారుల సంఘం అధ్యక్షుడు షేక్ ముస్తఫా దర్శకత్వంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శన అందరిని అలరించింది. ఈ నాటకంను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యన్ వి సుబ్బారావు ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరించి పోతున్న కళలను మళ్ళీ బ్రతికించెందుకు కళాకారులు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం అన్నారు. ఇటువంటి నాటకాలు మన మధ్య ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ నాటక ప్రదర్శనలో కళాకారులు తాయ సైదులు, యడ్లపల్లి శ్రీనివాస్ చౌదరి రూపావత్ వెంకట్రామ్ బొమ్మకంటి నాగరాజు పిట్టల శ్రీను పేరూరి సైదులు, తదితరులు పాల్గొన్నారు.