కమనీయం.. రమణీయం.. సీతారాముల కల్యాణం
మల్కపేట రామాలయంలో కన్నుల పండువగా రాములోరి కళ్యాణం
మాజీ మంత్రి ఆలయ వ్యవస్థాపకులు చల్మెడ ఆనందరావు
బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు
కోనరావుపేట మార్చి 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం మలకపేట గ్రామంలో రమణీయం కమనీయం రాములోరి కళ్యాణం... కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని సీతారామ హనుమ సమేత రామాలయంలో కోదండ రాముని కళ్యాణం ఎంతో కన్నుల విందుగా శుక్రవారం జరిగింది. ఈ కళ్యాణ వేడుకకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు, ఆలయ వ్యవస్థాపకులు చల్మెడ ఆనందరావు, మీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేములవాడ నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, వారి సతీమణి సునీల దంపతుల సమక్షంలో అర్చకుల వేదమంత్రోత్సవాల మధ్య పునర్వసు నక్షత్రమున రాములోరి కళ్యాణం ఎంతో కన్నుల విందుగా జరిగింది.
ఈ కళ్యాణ వేడుకకు మారుమూల గ్రామాలను ఉండే కాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వేల సంఖ్యలో అత్యధికంగా భక్తజనం రావడంతో రామాలయమంతా రామనామం జపంతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వ్యవస్థాపకులు, మల్కపేట గ్రామ ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కళ్యాణం తిలకించిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను వితరణ గావించారు.
వాసవి క్లబ్‌ల ఆధ్వర్యంలో భక్తులకు వడపప్పు... బెల్లం పానకం అందజేత
సుల్తానాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ పెరిగిద్ద హనుమాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా చూడముచ్చటగా కన్నుల పండుగగా జరిగిన శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదమైన వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) మరియు బెల్లం పానకం ను శ్రీ వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ వారు వితరణ చేశారు, వేసవిలో శరీరానికి ఇది చలువచేస్తాయి ఆరోగ్యానికి చాలా మంచిది , తురిమిన బెల్లం నీళ్లు, యాలకుల పొడి, మిర్యాల పొడి , సొంటితో పానకం తయారు చేస్తారు.. నానబెట్టిన పెసరపప్పుతో వడపప్పు నిముషాలు తయారవుతాయి ఇవి శ్రీ సీత రామచంద్రునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలుగా భావిస్తారు, దీనిని భక్తులకు అందించడం ద్వారా వారి శరీరానికి శక్తిని ఇస్తుందని వారి నమ్మకం... ఈ కార్యక్రమంలో వాసవి వనిత క్లబ్, వాసవి క్లబ్ , ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌లో నేత్రపర్వంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయరామరావు
సుల్తానాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): జై శ్రీరామ్... జై జై శ్రీరామ్.. అంటూ భక్తుల నినాదాలతో శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మారు మోగింది, శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకలు నేత్రపర్వంగా వైభవంగా జరిగాయి, ఆంజనేయ స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి, ఆధ్యాత్మికత నిండుకున్నాయి, సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, బొంతకుంటపల్లి, కాట్నపల్లి , ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామాల్లో , సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్, మార్కండేయ యుకాలనీ శ్రీ.రామనవమి మహోత్సవని పురస్కరించుకొని శుక్రవారం రోజున పలు రామాలయాల్లో శ్రీ.సీతారాముల కల్యాణాన్ని వీక్షించి ఆలయాల్లో తెలంగాణ ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ముందుగా అర్చకులు గ్రామ ప్రజలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
తదుపరి ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయరమణ రావు ను ఘనంగా సత్కరించారు..అనంతరం పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఊరేగింపు పల్లకి సేవా మహోత్సవంలో పాల్గొనడం జరిగింది... కాగా సుల్తానాబాద్ పెరిగిద్ద ఆంజనేయస్వామి దేవాలయం వద్ద సీతారాముల కల్యాణోత్సవం వేడుకల్లో ఆలయ చైర్మన్ ఆకుల రామేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం చైర్మన్ పల్ల మురళీధర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం క్యాషియర్ కొమురవెల్లి (కేబి) శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు.
అర్చకులు అభిలాష్ శర్మ , శ్రవణ్ కుమార్ శర్మ , వినయ్ త్రిపాటి లు స్వామి వారి కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు, అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు, అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు, సామాజిక సేవకులు కత్తెర్ల పోచమల్లు , సంతోష్ , పిడుగు విమల, సాదుల కర్ణాకర్ , మేంగాని శ్రీనివాస్, గొట్టం రాజు పలువురు ఉన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , పలు గ్రామాల సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




