13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అంతా రామమయం

28-03-2026 12:00 AM

ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పలు రామాలయాల్లో  వేడుకలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలంలోని రామాలయాల్లో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో పాటు జానకి రాముని కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి.

అటు ఓల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల రామాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం వేద పండితుల  మంత్రోచ్ఛారణల నడుమ జ రిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవాలను తిలకించారు. అనంతరం తలంబ్రాల బుకింగ్ కౌంటర్ ను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు.  సీతారాముల కళ్యాణం సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే దంపతులు స్వామి వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.