28 March, 2026 | 2:29 AM

మా పోరాటంతోనే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పున:ప్రారంభం

28-03-2026 12:00 AM

మాజీ మంత్రి రామన్న వెల్లడి

ఆదిలాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): తమ పోరాటం వల్లనే తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పున:ప్రారంభం అయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.  శుక్రవారం ఆదిలాబాద్‌లోని తాంసి బస్టాండ్ వద్ద జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు జరుగు తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ప్రజ లు ఇబ్బందులు లేకుండా త్వరగా పనులను నాణ్యత పాటిస్తు పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ, ఎమ్మె ల్యేలు మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని ఓట్ల కోసం రైల్వే పనులను ప్రారం భించి అర్ధంతరంగా వదిలేశారని ఆరోపించారు. దీంతో రైల్వే ట్రాక్ కు అటువైపుగా ఉన్న వివిధ కాలనీల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నా రు.

దీంతో తమ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల క్రితం పోరాటలు చేస్తే తప్ప పనులు ప్రారంభించలేకపోయారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు యా సం నర్సింగ్ రావు, మార్శెట్టి గోవర్ధన్, ప్రహ్లాద్, నారాయణ, మహేందర్, ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు.