రాజు వాణి దంపతులకు స్వామివారి శేష వస్త్రం అందజేత
28-04-2026 08:15 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్లో గల శివాలయంలో మంగళవారం వోల్లాల రాజు వాణి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా స్వామివారికి విశేషంగా రుద్రాభిషేకం జరిపించిన్నారు. అనంతరం వారికి స్వామి వారి శేష వస్త్రాన్ని అందించిన ఆలయ అర్చక దంపతులు వల్ల కొండ మఠం రమేష్ శైలజ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ చైర్మెన్ అల్లెంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.






