అమెరికా సామ్రాజ్యవాద యుద్దోన్మాదాన్ని ఖండిస్తూ...
కార్మిక హక్కులను కాలరాస్తూ BJP ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను నివసిస్తూ.....
వాడవాడాల "మేడే"ను జరపండి: CPM
రఘునాథపాలెం,(విజయక్రాంతి): మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన "మేడే"ను వాడ, వాడాల నిర్వహించాలని, కార్మిక, కర్షక శ్రామిక వర్గాన్ని సంఘటితం చేయాలని, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్య వాదులు తమ ఆధిపత్యం కోసం ఇరాన్ పై సాగిస్తున్న యుద్దో న్మాదాన్ని టారఫ్ ల పేరుతో ప్రపంచ దేశాలపై చేస్తున్న వాణిజ్య యుద్ధాన్ని కార్మిక వర్గం ఖండించాలన్నారు. అమెరికా ఎన్ని రకాలుగా భారత్ ప్రయాజనాలను, దాని సార్వభౌమధికారాన్ని ఎంతగా అవమానించిన, దెబ్బతీసిన నోరు మెదపకుండా లొంగుబాటును ప్రదర్శించి, మన జాతీయతను ట్రంప్ కు తాకట్టు పెట్టిన BJP -మోదీ ప్రభుత్వం వైఖరిని నిరసించాలన్నారు.
అనేక త్యాగాలతో, పోరాటాలతో భారత కార్మిక వర్గం సాధించుకున్న చట్టబద్ధ, రాజ్యాంగ బద్ధ హక్కులను కాలరాస్తూ, శ్రామిక వర్గాన్ని కార్పొరేట్ పెట్టుబడి దారులకు, కట్టు బానిసలుగా మార్చే టందుకు తెచ్చిన 4 లేబర్ కోడ్ లను ప్రభుత్వం ఉపసంహారించుకునేలా, కార్మిక వర్గం గళం విప్పాలని అందుకోసం సమరశీల పోరాటాలకు, మేడే రోజున ప్రతిన బూనాలని నున్నా పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు కార్మిక, కర్షకు లందరూ వీధి,వీధినా ఎర్రజెండాలు ఎగురవేయాలని అరుణమయం చేయాలని పిలుపునిచ్చారు.






