17-07-2025 12:37:13 AM
ఖమ్మంపల్లి ఇసుక క్వారీ లో రూ.3 నుండి 5000 వేలు డబ్బులు ఇచ్చినా వాల్లకే లోడు చేస్తున్నారని
పెద్దపల్లి లో కలెక్టర్ కార్యాలయం ముందు లారీ డ్రైవర్ల నిరసన
పెద్దపల్లి,(విజయక్రాంతి): వారం రోజులుగా ఒంటికి, రెంటికీ రోడ్డుపైనే ఉంటున్నామని ఇసుక లారీ డ్రైవర్ల పెద్దపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని ఇసుక డంపు వద్ద దళారులకు (డబ్బులు ఇచ్చిన వారికీ ఇసుక క్వారీ యాజమాన్యం) ముందు లోడ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము గత వారం రోజుల నుండి ఇసుక లోడ్ కోసం ఖమ్మంపల్లి ఇసుక క్వారీ సమీపంలో ప్రధాన రహదారి పై ఉంటున్నామని, దీంతో తాము కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామన్నారు. తాము ప్రభుత్వానికి డీడీ తీశామని, మరి తమకు ఎందుకు లోడ్ చేయడం లేదని క్వారీ యాజమానిని అడిగినందుకు మొత్తానికే లోడింగ్ ముసి వేశారని కలెక్టర్ కు తెలిపారు. క్వారీ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి, కలెక్టర్ కు లారీ డ్రైవర్లు వినతి పత్రం అందజేశారు.