17 July, 2026 | 2:20 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

21-09-2024 11:09 AM

పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని బలవన్మరణం

కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన  విషాద ఘటన

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదని ఆ జంట అఘాయిత్యానికి పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ లో శనివారం వెలుగు చూసింది. కోనాపూర్ గ్రామానికి చెందిన చెందిన సాయికుమార్, వీణ కులాలు వేరువేరు. గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. తల్లిదండ్రులకు ఇరువురు పెళ్లి విషయం చెప్పారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులుప్రేమ వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన సాయికుమార్, వీణలు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.