calender_icon.png 21 August, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టల్ పై నుంచి దూకిన విద్యార్థిని

21-09-2024 10:36:20 AM

రాజన్న సిరిసిల్ల: వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం రాత్రి పర్లపల్లి అశ్విత అనే 8వ తరగతి విద్యార్థిని హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక వసతి గృహం మొదటి అంతస్తు పై నుండి దూకింది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఎల్లారెడ్డిపేట లోని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. వసతి గృహం లో ఉండలేక పలు మార్లు హాస్టల్ నుంచి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు బుజ్జగించి పంపించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.