28-04-2025 12:00:00 AM
‘ఒద్దిరాజు సోదర కవుల సాహితీ పురస్కారం కోసం వరంగల్లుకు చెందిన సహృదయ, సాహిత్య సాంస్కృతిక సంస్థ రచయితల నుంచి తెలుగు కథా సంపుటులను ఆహ్వానిస్తున్నది. 28వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పురస్కారం కింద రూ. 10,000/- నగదు బహుమతిని ఇవ్వనున్నట్టు సంస్థ అధ్యక్షులు గిరిజా మనోహర బాబు, ప్రధాన కార్యదర్శి కుందావజ్జల కృష్ణమూర్తి ప్రభృతులు ఒక ప్రకటనలో తెలిపారు.
2018 జనవరి నుంచి డిసెంబర్ 2024 లోగా పుస్తక రూపంలో ప్రథమ ముద్రణ పొందిన కథా సంపుటాలు మాత్రమే ఈ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారానికి అర్హమైనవిగా వారు పేర్కొన్నారు. రచయితలు పరిశీలనార్థం తమ రచనలను (మూడు ప్రతులు) 30.05.2025లోగా పంపాలి.
చిరునామా: డా.ఎన్.వి.ఎన్.చారి,2- విజయ గణపతినగర్, రోడ్డు నెం. 10 బి, హనుమకొండ- 506009, సెల్: 9866610429