16 July, 2026 | 9:11 AM

లక్నో X చెన్నై

19-04-2024 12:26 AM

రాత్రి 7.30 నుంచి.. 

లక్నో, ఏప్రిల్ 18: వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్.. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. తాజా సీజన్‌లో చెన్నై ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు లక్నో మాత్రం సీజన్‌లో పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. లక్నో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. అన్ని రంగా ల్లో పటిష్టంగా కనిపిస్తున్న చెన్నైను తట్టుకొని లక్నో ఏ మేరకు నిలబడుతుందనేది ఆసక్తికరం.

చెన్నై జట్టు బ్యాటింగ్ సమతుల్యంగా ఉంది. అజింక్యా రహానే, రచిన్ రవీంద్రలు ఆరంభాలను ఇస్తున్నప్పటికి భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారు. ఇక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ ధూబే, డారిల్ మిచెల్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ జడేజా తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. ఇక ఫినిషర్‌గా ధోని అదరగొడుతున్నాడు. మరోవైపు లక్నో బ్యాటింగ్ సమస్యలతో సతమతమవుతున్నది.