భయపెట్టిన అశుతోష్..
19-04-2024 12:27 AM
ముంబై బౌలర్ల ధాటికి 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ పంజాబ్‌ను యువ ఆటగాళ్లు ఆదుకున్నారు. అసాధ్యమనిపించిన లక్ష్యాన్ని ఛేదించాలనే కసితో అందిన బంతిని అందినట్లు బౌండ్రీ దాటించారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో శశాంక్ ఔటైనా.. అశుతోష్ మాత్రం అదరగొట్టాడు. ముంబై బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తూ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోగా.. 18 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో అశుతోష్ ఔటవడంతో పంజాబ్ విజయానికి దూరమైంది.






