16 July, 2026 | 9:26 AM

సూర్య ప్రతాపం

19-04-2024 12:25 AM

ముంబైకి మూడో విజయం n  పోరాడి ఓడిన పంజాబ్

ముల్లాన్‌పూర్: ఐపీఎల్లో పడుతూ లేస్తూ సాగుతున్న ముంబై ఇండియన్స్ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. బ్యాటర్ల జోరుకు బౌలర్ల సహకారం తోడవడంతో.. గురువారం జరిగిన పోరులో ముంబై 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హైదరాబాదీ తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు.

ఇషాన్ కిషన్ (8), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాళ్లు అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడారు. శిఖర్ ధవన్ స్థానంలో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు సామ్ కరన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సాధార ణంగా లోయర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే  కరన్ (6) ఓపెనర్‌గా వచ్చి విఫలం కాగా.. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0), రిలీ రొసో (1), లివింగ్‌స్టోన్ (1), హర్ప్రీత్ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. ముంబై బౌలర్లలో బుమ్రా, కోట్జీ చెరో  మూడు వికెట్లు పడగొట్టారు. 

సంక్షిప్త స్కోర్లు

ముంబై: 192/7 (సూర్యకుమార్ 78, రోహిత్ 36; హర్షల్ 3/31, సామ్ కరన్ 2/41), పంజాబ్: 19.1 ఓవర్లలో 193 ఆలౌట్ (అశుతోష్ 61, శశాంక్ 41; బుమ్రా 3/21, కోట్జీ 3/32).