calender_icon.png 29 August, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేసింది మచ్చా!

01-10-2024 03:06:59 AM

  ‘గేమ్ చేంజర్’ నుంచి రెండో పాట వచ్చేసింది. ‘రా మచ్చా మచ్చా..’ అంటూ సాగుతున్న ఈ పాట ‘కళ్లజోడు తీస్తే..’ అన్న పల్లవితో ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మేకర్స్ ఈ పాటను తెలుగు, తమిళ వెర్షన్లలో విడుదల చేశారు. ‘ధమ్ తు  దికాజా..’ అంటూ సాగే హిందీ వెర్షన్‌ను కూడా సంగీత ప్రియుల ముంగిట్లోకి వదిలారు. హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.