calender_icon.png 18 September, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మదన్ లాల్ డింగ్రా జయంతి వేడుకలు

18-09-2025 02:57:38 PM

మందమర్రి, (విజయక్రాంతి): స్వాతంత్ర్య సమర యోధులు మదన్ లాల్ డింగ్రా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చారు. పట్టణంలోని సింగరేణి హైస్కూల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్గిల్ యుద్ధ వీరుడు సింగరేణి ఎస్అండ్ పిసి ఉద్యోగి రాజేష్ పివ్హల్ మదన్ లాల్ డింగ్రా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి విద్యార్థులకి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుడు రాజేష్ పివ్హాల్, పాఠ శాల ప్రధానోపాధ్యాయులు జే పురుషోత్తం లు  మాట్లాడారు. మదన్ లాల్ ధింగ్రా 18 సెప్టెంబర్ 1883 న భారతదేశంలోని అమృత్‌సర్‌ లో విద్యావంతులు, సంపన్న మైన పంజాబీ కుటుంబంలో జన్మించాడని అతని  విద్యాభ్యాసం విదేశాలలో  పూర్తి చేశారన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న వినాయక్ దామోదర్ సావర్కర్, శ్యామ్‌జీ కృష్ణవర్మ లతో పరిచయం కాగా వారి ప్రోత్సాహంతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు.  

భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి జాతీయతా వాదులకు దింగ్రా స్ఫూర్తిగా నిలిచాడన్నారు. స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మదన్ లాల్ ధింగ్రా ను నాటి బ్రిటిష్ ప్రభుత్వం హత్య నేరంలో అరెస్టు చేసి 17 ఆగస్టు 1901 సం,,లో ఉరి శిక్ష విధించార న్నారు. ఆయన మరణానంత రం నాటి ప్రభుత్వం అతని జ్ఞాపకార్థంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసిందని గుర్తు చేశారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల జీవితాలను, పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు ఏ శ్రీనివాస్, పి తిరుపతిరెడ్డి, వై సుధాకర్, విద్యార్థులు, పాఠ శాల సిబ్బంది  పాల్గొన్నారు.