calender_icon.png 18 September, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు కాదు... భవిష్యత్తుకే ప్రాధాన్యతివ్వాలి.!

18-09-2025 03:00:14 PM

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విద్యార్థులు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్(Nagarkurnool District Collector) బాధావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్‌ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్‌ వాడకం విద్య, ఆరోగ్యం, సామాజిక జీవనంపై తీవ్రమైన ప్రభావాలు చూపుతాయని హెచ్చరించారు. డ్రగ్స్‌ రవాణా, వాడకం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అనుమానాస్పద సమాచారం 100, 112 నంబర్లకు అందించాలని, ఇచ్చే సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ రహిత అవగాహన గొడవ పత్రికను ఆవిష్కరించారు. డ్రగ్స్ రహితపై రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.