17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీసీల ఉసురు తగిలే మాధవరెడ్డి ఓటమి

14-02-2026 12:07 AM
  1. ఓడించిన కేశవాపూర్ ప్రజలకు అభినందనలు 
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్  

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి) : మున్సిపల్ ఎన్నికల్లో మూడుచింత లపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ వార్డు కౌన్సిలర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టంగారి మాధవరెడ్డి బీసీల ఉసురుతగిలి ఓటమి పాలయ్యారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటన లో పేర్కొన్నా.

బీసీల నోటికాడు ముద్దను గుంజుకుని, బీసీల తినే కంచంలో మన్ను పోసిన మాధవరెడ్డిని ఓటు ఆయుధంతో ఓ డించాలని తాము ఇచ్చిన పిలుపును గౌరవించి కేశవపూర్ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మద్దతు పలికే అగ్రకుల ప్రజాస్వామ్యవాదు లు ఒక్కటై తగిన శాస్తి చేశారని అన్నారు.

ఇందుకు రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీ ప్రజల తరఫున కేశవాపూర్ వార్డు ప్రజలకు అభినందనలు తెలియజేశారు. బీఆర్‌ఎ స్ పార్టీ, మాధవరెడ్డిని గెలిపించాలని ప్రచా రం నిర్వహించిన చామకూర మల్లారెడ్డి ఇప్పటికైనా తక్షణమే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీసీ సమాజం ముందు బీఆర్‌ఎస్‌ను, మల్లారెడ్డిని దోషిగా నిలబెడతామని ఆయన హెచ్చరించారు.