15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

ఆధ్యాత్మికతోనే మానసిక ప్రశాంతత

14-02-2026 12:07 AM

విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పేరును అష్టలక్ష్మి దేవాలయంగా మార్చడానికి కృషి చేస్తా

మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద

ఎల్బీనగర్, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మికత ద్వారానే మానసిక ప్రశాంత ఉంటుందని, దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. ఆర్కేపురం డివిజన్ వాసవికాలనీలోని అష్టలక్ష్మి దేవాలయంలో మూడు దశాబ్దాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవలు, నిర్వహణ ప్రమాణాలు, పారదర్శకతకు గుర్తింపునిస్తూ అష్టలక్ష్మి దేవాలయానికి హెచ్ వైఎం ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా ఐఎస్ వో 9001:2015 సర్టిఫికెట్ అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

హెచ్ వై ఎం ఇంటర్నేషనల్ సంస్థ ఎండీ శివయ్య నేతృత్వంలో చైర్ పర్సన్ నేరెళ్ల శారద తదితరులు దేవాలయ ఫౌండర్ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, చైర్మన్ సోమ సురేష్ కుమార్ కు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శారద మాట్లాడుతూ... విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పేరును అష్టలక్ష్మి దేవాలయం పేరుగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే పేరు మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కోశాధికారి ఐత అంజయ్యగుప్తా, కార్యదర్శి గంప జగన్, కార్యదర్శి దాసేపల్లి శ్రీనివాస్, చిలక మధుర ఉపేందర్ రెడ్డి, తమ్మన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.