25 March, 2026 | 3:02 AM

మాధవీలత వీడియో కలకలం

25-03-2026 01:40 AM
  1. ఢిల్లీ విమానాశ్రయంలో శ్లోకాల పఠనం
  2. మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు: కాంగ్రెస్

న్యూఢిల్లీ, మార్చి 24: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముస్లిం మహిళలు ప్రార్థనలు చేసుకొనే ప్రత్యేక గదిలో బీజేపీ నాయకురాలు మాధవీలత శ్లోకాలు పఠిస్తున్న వీడియో దేశమంతటా కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిగా మారింది. విమానాశ్రయంలోని ప్రార్థనా గదిలో మాధవీలత దుర్గాదేవి సూక్తంలోని దివ్య శ్లోకాలను పఠించారు.

ఈ వీడియో పై కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ కో ఆర్డినేటర్ మహమ్మద్ వసీం ఆగ్రహం వ్యక్తంచే శారు. విమానాశ్రయంలోని ప్రార్థనా గదిలో ఫోన్ కెమెరాలతో వీడియోలు తీయడం, మంత్రాలు జపిస్తూ శబ్దం చేయడం నియమనిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇతరు లకు అసౌకర్యం కలిగించడమేనని అసహనం వ్యక్తంచేశారు. ఆమెపై చర్యలు చేపట్టాలని కేం ద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ఆయన కోరారు. తాను విశ్వమాత నుంచి శక్తిని పొం దానని దివ్యశ్లోకాలను పఠించడంలో లీనమయ్యానని మాధవీలత ఎక్స్‌లో పోస్టు చేశారు.

విమానాశ్రయ ప్రార్థనా గదిలో విశ్వమాత నుంచి శక్తిని పొందానన్నారు. గాఢమైన నిశ్శబ్దానికి, లోతైన ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రార్థనా మందిరాలు నిలయాలు కావాలని ఆమె అన్నారు. గతంలో హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ మాధవీలత మసీదుపై బాణాలు ఎక్కుపెట్టిన ఫొటోలు వివాదాస్పదమయ్యాయి. ఇటీవల రంజాన్ చివరివారంలో బంజారాహిల్స్‌లో ఎంఐఎం ఏర్పాటుచేసిన పోస్టర్లను బహిరంగంగా చించివేస్తూ ఆమె సవాల్ విసిరారు.