10 April, 2026 | 1:32 AM

మధుసూదన్‌రెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకో..

10-04-2026 12:02 AM

బీఆర్‌ఎస్ నేతలు వంగేటి లక్ష్మారెడ్డి, రాం నర్సింహగౌడ్

తుర్కయంజాల్, ఏప్రిల్ 9: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిపై కాంగ్రెస్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాం నర్సింహగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిభట్ల సర్కిల్లో కోహెడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్ష్మారెడ్డి, రాం నర్సింహగౌడ్ మాట్లాడుతూ గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి చిల్లర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

కోహెడ మార్కెట్ భూముల విషయంలో బీఆర్‌ఎస్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా... ఇష్టారాజ్యంగా మాట్లాడటం శోచనీయమన్నారు. చిలుక మధుసూదన్రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. సీఎం రేవంత్రెడ్డి మెప్పుకోసం, కొందరి స్వార్థప్రయోజనాల కోసం నోరు పారేసుకుంటే జాగ్రత్త అని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

రైతుల శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని కోహెడలో 200 ఎకరాల్లో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని గతంలో కేసీఆర్ శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. ఆ భూములను టీజీఐఐసీ ఇచ్చి... రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బిందు రంగారెడ్డి, కల్యాణ్నాయక్, సామ శ్రీనివాసరెడ్డి, చక్రవర్తిగౌడ్, కిషన్గౌడ్, బుడ్డ బాబు, కోటేశ్వరరావు, ధనుంజయగౌడ్, పల్లపు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.