10 April, 2026 | 1:15 AM

నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం

10-04-2026 12:01 AM
  1. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐఐటీ తరగతులు 

ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్, ఏప్రిల్ 9 :నకిరేకల్ లో త్వరలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తామ ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని సాయి బాబా ఆలయంలో, నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 499 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.1 కోటి 78 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణానికి ట్రామా కేర్ సెంటర్ మంజూరు అయినట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.కడపర్తిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని,హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారన్నారు గత 10 సంవత్సరాల్లో బీఆర్‌ఎస్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందన్నారు.

గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో డిండి, బ్రహ్మణవెల్లంల, అయిటిపాముల, శివనగూడెం ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని పేదలందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా గృహజ్యోతి కింద లబ్ధి జరుగుతుందన్నారు వచ్చే సంవత్సరం నుండి 25 పాఠశాలలో IIT కోచింగ్ అందించబోతున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్లు గుత్తా మంజుల - మాధవ్ రెడ్డి, నర్రా వినోద్ - మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు చేవుగోని రజిత - శ్రీనివాస్, పందిరి గీత - రమేష్, మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, గుడిపాటి లక్ష్మీనరసింహ, కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.