28 July, 2026 | 12:56 AM

మధుసూదన చారి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో చెప్పాలి

28-07-2026 12:00 AM

పార్టీని విచ్చిన్నం చేసే చర్యలు సరికాదు: బీఆర్‌ఎస్ నేతలు

భూపాలపల్లి, జులై 27 (విజయ క్రాంతి): మధుసూదన చారి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో చెప్పాలని భూపాలపల్లిలో పార్టీని విచ్చిన్నం చేసే చర్యలు సమంజసం కాదని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కటకం జనార్దన్, గండ్ర హరీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.మాజీ శాసన సభాపతి సిరికొండ మధుసూ దనచారి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణారెడ్డి పేరును ప్రకటించినట్లు గుర్తు చేశారు.ప్రజల్లో పార్టీ బలోపేతం చేస్తున్న సమయంలో తప్పుడు సంకేతాలు ఇచ్చి కార్యకర్తలను అయోమయానికి గురి చేయడం సరికాదని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను అందరూ పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.