సేవా గుణాన్ని చాటుకున్న యంగ్ స్టార్స్ యువత
సంస్థాన్ నారాయణపూర్, జూలై 27: మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన యంగ్ స్టార్స్ యూత్ సభ్యులు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు కుర్చీలు అందజేసి తమ సేవగుణాన్ని చాటారు. అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో కుర్చీలను అందజేసినట్లు తెలిపారు.
యంగ్ స్టార్ యూత్ సభ్యుల సేవాభావం, విద్యార్థుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శప్రాయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాల విద్యార్థులు యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్ సభ్యులు గంట నవీన్, కడ్తల గోపి, వీరమల్ల వేణు, బాతరాజు లాలూ, నర్రీ మహేష్, పందుల నాగరాజు , గుండ్లపల్లి శివ, వీరమల్ల బన్నీ, నర్రీ నవీన్, నర్రీ రాజు, నర్రీ చందూ దోంతరగోనీ చంటి పాల్గొన్నారు.






