విద్యార్థుల ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతు
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ యాదవ్
ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): విద్యార్థులు చేసిన ఉధ్యమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించి వారికి అండగా నిలవడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అరవింద్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ నుంచి కాం గ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన ర్యాలీని అరవింద్ కుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఢిల్లీలో చేసిన శాంతియ త పోరాటానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు సంపూర్ణ మద్దతు ఇచ్చి పార్లమెంట్ లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై గళమెత్తడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా కార్యదర్శి దేవి వరప్రసాద్, భోలక్ పూర్, బాపూజీనగర్, ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రహీం, నరేందర్ బాబు, లింగాల శ్రీకాంత్ గౌడ్, నియోజకవర్గం బి-బ్లాక్ కమిటీ ఉపాద్యక్షుడు పట్నం నాగభూషణం గౌడ్, పార్టీ నాయకులు జఫీర్ ఉద్దీన్, అల్లాఉద్దీన్, అగ్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.






