05-10-2025 01:22:58 AM
ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ‘రాజాసాబ్’ను పూర్తిచేస్తున్న ఆయన మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ షూటింగ్‌లో పాల్గొంటారు. ‘యానిమల్’ తర్వాత సందీప్ వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై భారీ అంచనాలున్నాయి.
అయితే, ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రీని ఇప్పటికే హీరోయిన్‌గా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తోంది.
మలయాళ భామ మడోనా సెబాస్టియన్ ఇందులో భాగం కానుందని టాక్ వినవస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన మడోనా.. పాత్ర నచ్చితే ఎంత చిన్న రోల్ అయినా చేయడానికి వెనుకాడదు. ఇక ప్రభాస్‌తో అవకాశం అంటే ఎందుకు వదులుకుంటుంది? కచ్చితంగా గ్రీన్‌సిగ్నల్ ఇస్తుంది. అధికారికంగా ప్రకటించకున్నా రెబల్ స్టార్ పక్కన మడోనాను ఊహించుకుంటూ డ్రీమ్స్‌లోకి వెళ్లిపోతున్నారు ఫ్యాన్స్.