05-10-2025 01:24:23 AM
కిల్లింగ్ లుక్స్‌తో యువతను ఉర్రూతలూగించే అందాల తార సన్నీలియోన్. ఇప్పుడు లీడ్ రోల్‌లో థ్రిల్ పంచేందుకు ముస్తాబవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజాచిత్రం ‘త్రిముఖ’. రజేశ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మిస్తున్నారు.
ఇందులో సన్నీలియోన్ మెయిన్ లీడ్‌లో నటిస్తుండగా యోగేశ్ కల్లే, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, షకలక శంకర్, ఆషురెడ్డి, సుమన్, రవిప్రకాశ్, సాహితి, సూర్య, జీవా, జెమిని సురేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ను చూస్తుంటే థ్రిల్లర్ సినిమాలా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల కానుంది. టీమ్ ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.