30 July, 2026 | 1:31 AM

ప్రత్యేక పూజలో మాగంటి సునీత

30-07-2026 12:53 AM

జూబ్లీహిల్స్, జూలై 29(విజయక్రాంతి): గురు పౌర్ణమిని పురస్కరించుకొని కృష్ణానగర్ డివిజనులోని కనకదుర్గ సహిత శిరిడీ సాయిబాబా దేవాలయలో ప్రత్యేక పూజను నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ పూజలో బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జి మాగంటి సునీత గోపీనాథ్ పాల్గొన్నారు. తీర్థప్రసాదాలను, పండితుల వేదాశీర్వచనాలను స్వీకరించారు. ప్రజలంతా దైవాశీస్సులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.