జెన్ జీలతో బీసీ ఉద్యమం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం నీట్ ఉద్యమం తరహాలో సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా ‘జెన్ జీ’ డిజిటల్ ఉద్యమాన్ని నిర్మించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ గుజ్జ సత్యం పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ రాజ్యాధికార పార్టీ చైర్మన్ ఏఐసీసీ బీసీ ఇన్చార్జి వీజీఆర్ నారగోని, ఏఐసీసీ బీసీ ఇన్చార్జి కత్తి వెంకటస్వామి, మన ఆలోచన సాధన సమితి (మాస్) కటకం నర్సింగ్ రావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులగణన, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు, యువత, మహిళలు ఐక్యంగా రాజ్యాంగబద్ధ ఉద్యమాలు చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.






