calender_icon.png 16 November, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి జాడు చాలావ్ యాత్ర

15-11-2025 12:00:00 AM

ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఈనెల 15 నుండి జాడు చలావ్ యాత్రని మొదలు బెడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రదిడ్డి సుధాకర్ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం లిబర్టీ లోని ఆప్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపెతమే ద్యేయంగా, ముఖ్యంగా రానున్న ఎంపీటీసీ జడ్పిటిసి పురపాలక సంఘ కార్పొరేషన్ ఎలక్షన్ లో పార్టీ బలోపేతం చేయడానికి, మెంబర్షిప్ డ్రైవ్లు పాదయాత్రలు చేయాలని, పార్టీ నాయకులకి దశ దిశ నిర్దేశ చేయడం జరిగిందని తెలియజేశారు.

జూబ్లీహిల్స్ లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ లో అన్నింటిలో కూడా డబ్బు పలుకుబడే గెలిచిందని, దీనివల్ల ప్రజలకి ఎటువంటి న్యాయం జరగదని తెలియజేశారు. మరో సారి పహాల్గవ్, ఢిల్లీ పేలుళ్ళు అడ్డు పెట్టుకొని బీజేపీ బీహార్ లో గెలిచిందని అన్నారు. ఇదిగో జాడు చాలావ్ పాద యాత్ర ఆమ్ ఆధ్మీ పార్టీ తెలంగాణ కోసం ఒక అందమైన పోస్టర్ టెకస్ట్ లే అవుట్ రాష్ట్ర వ్యాపితంగా జరిగే జాడు చాలావ్ యాత్రలు, అవినీతిని శుభ్రం చేద్దాం ! ప్రజాస్వామ్యాన్ని బలపర్చుదాం !! అనే నినాదం తో సాగుతాయని తెలియ చేశారు.

ఈనెల 26 ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పెద్దఎత్తున కార్యక్రమామాలు నిర్వహిస్తామని తెలియ చేశారు. ఈ కార్యక్రమం లో బుర్ర రాముగౌడ్, డాక్టర్ బేగ్, హేమాజిల్లోజు విజయ్ మల్లంగి, సుధారాణి, డాక్టర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు.