15-11-2025 12:00:00 AM
చాణక్య స్టేటజిస్ సర్వే
ఖైరతాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు మేడంగా ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతల తప్పిదాల వల్ల ఓటమిపాలయ్యారాని చాణిక్య సర్వే ముకేష్ తెలిపారు.సానుభూతి ఉన్నపటికి వినియోగించుకోకపోవడం వల్లే ఓటమిపాలయ్యారని నవంబర్ 4న చాణిక్య ఆధ్వర్యంలో తెలిపిన ఎగ్జిట్ పోల్ సర్వే బిఆర్‌ఎస్ గెలుపు అవకాశాలు అని వెల్లడించిన సర్వేలో ఒక్కసారి జరిగిన మార్పులు తమ సర్వేయర్లు చేసిన సర్వేలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు.
వాటిని ఆధారం చేసుకుని నవంబర్ 11న తిరిగి కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెండు గా ఉన్నాయని తాము తెలియజేయడం జరిగిందని అన్నారు. దీనికి ప్రధాన కారణం 8,9,11 తేదీల్లో ప్రతిపక్ష నాయకులు ప్రజల వద్దకు వెళ్లలేక పోవడమే అని అన్నారు .అధికారపక్షం వారు మంత్రులు చైర్మన్లు వారితో పాటు ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ఓటర్లను కలిసే అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవడమే కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణమైందని తెలిపారు.