15-11-2025 12:00:00 AM
ముషీరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): డా.హిప్నో పద్మా కమలాకర్, యోగా గురు సరోజని రామారావు, లయ న్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ ప్రాంగణం నవ్వులతో, ఆటలతో, ఆనందంతో కళకళలాడింది. ప్రత్యేకంగా పెద్దలు తిరిగి పిల్లల్లా మారి సంబరాలు చేసుకోవడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.
ఈ కార్యక్రమంలో యోగా గురువులు సరోజని, రామారావు, సివియర్ అడ్వకేట్ రాజేంద్ర కుమార్, వెంకటేశ్వర్లు, రాజా నరసింహ , రాజేష్, నాగభూషణం, శ్రీలత, అనితా, ప్రతిమ, రాజ్యలక్ష్మీ, జ్యోతి రాజా, పూర్ణ కుమారి, కృష్ణ వేణి, డా. హిప్నో పద్మా కమలాకర్ యోగా సాధకులు పాల్గొన్నారు. ఉదయం వెలుగుల్లో స్నేహితులతో కలిసి కాగితపు పుట్టగొడుగుల టోపీలు ధరించి, టీమ్ ఆక్టివిటీల్లో పాల్గొన్నారు.
పిల్లల్లా ఆటలాడుతూ ఫోటోలకు పోజులు ఇవ్వడం, బాల్యాన్ని గుర్తు చేసే చిన్న చిన్న ఫన్ గేమ్స్ మొత్తం వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చా యి. పురుషులు మహిళ లు వేర్వేరు టీంలుగా ఏర్పడి, నవ్వులు పూయించే క్రియేటివ్ హ్యూమన్ పిరమిడ్స్, హ్యాండ్‌చైన్ యాక్టివిటీస్, టీం ఎంజాయ్మెంట్ గేమ్స్ నిర్వహిం చుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసు పెరుగుతుంది కానీ మనసు మాత్రం పిల్లలుగానే ఉండాలన్నారు. ఇలాంటి వేడుకలు జీవితానికి చిరునవ్వులు తిరిగి తీసుకొస్తాయని తెలిపారు. బాలల దినోత్సవం సం దర్భంగా పెద్దలు పిల్లలుగా మారిన ఈ ప్రత్యే క వేడుక, అందరి హృదయాలలో ఆహ్లాదకరమైన గుర్తుగా నిలిచిపోయిందన్నారు.