3 April, 2026 | 3:29 PM

Breaking News

మార్పు రావాలంటే.. రేవంత్ రెడ్డి పోవాలి.. జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు   •   గంజాయి సేవించడం నేరం   •   దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు   •   TN Polls: 27 మందితో బీజేపీ అభ్యర్థుల జాబితా.. బరిలో దిగిన తెలంగాణ మాజీ గవర్నర్   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి   •   ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •  

18న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మహా దీక్ష

17-06-2025 12:53 AM

ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, జూన్ 16 (విజయ క్రాంతి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీ ప్రకారం స్థానిక ఎన్నికలు ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ తక్ష ణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రా జ్యాంగ రక్షిత చట్టం తేవాలన్నారు. లేని పక్షంలో డిల్లీలో కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హె చ్చరించారు. కులగనన, ప్రభుత్వ అసెం బ్లీ తీర్మానాలు, బీసీ కమిషన్ సానుకూల నివేదికల తదనంతరం కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూ పకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేం ద్రాన్ని ఒప్పించటానికి యుద్ధ ప్రతిపాదికన కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నాయకులు కోలా జ నార్దన్, దాసు సురేష్, నాగుల శ్రీనివాస్ యాదవ్, గోపి బోయ, సుధా కర్ ముదిరాజ్, ఉదయ్, శివమ్మ, ప ద్మ, భాగ్యలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.