27 August, 2026 | 3:00 PM

జనగామలో TGEJAC ఆధ్వర్యంలో మహా ధర్నా

27-08-2026 02:29 PM

జనగామ, (విజయక్రాంతి): తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా JAC నాయకులు మాట్లాడుతూ... పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలి.సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS) ను అమలు చేయాలి. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో   TGEJAC జిల్లా చైర్మన్, కో-చైర్మన్లు, TNGO's, TGO's, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.