calender_icon.png 11 January, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనియా గాంధీ కోలుకోవాలని మహా మృత్యుంజయ హోమం

09-01-2026 12:00:00 AM

మాజీ ఎంపీ వీ హనుమంతరావు

ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): యూపీఏ చైర్ పర్సన్, ఎంపీ సోని యా గాంధీ త్వరగా కోలుకోవాలని కోరు తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో గురువారం అంబర్పేటలోని మహంకాళి దేవాలయంలో ‘మహా మృ త్యుంజయ హోమం‘ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వి హనుమంత రావు మాట్లాడుతూ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని హోమం కార్యక్ర మాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జ్ఞానేశ్వర్ గౌడ్, దిడ్డి రాంబాబు, నారాయణ స్వామి, సీనియర్ నాయకులు శంభుల శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్, శ్రీధర్ గౌడ్, అనిల్, తలుపునూరి కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, గరిగంటి రమేష్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.