09-01-2026 12:00:00 AM
గుమ్మడిదల, జనవరి 8: యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడా పోటీలకు ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు మాజీ మంత్రి హరీశ్ రావును గురువారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం,జట్టు భావన, ఆరోగ్య స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలకు ప్రాధాన్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తిగా సిజిఆర్ ట్రస్ట్ యువత కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఆదర్శనీయమని అభినందించారు.
యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. 12వ తేదీ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.కార్యక్రమంలో జిన్నారం వెంకటేష్ గౌడ్, కుమార్ గౌడ్, సంతోష్ రెడ్డి, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.